: తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు పాస్టర్లను అపహరించిన మావోలు


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్లు అపహరణకు గురయ్యారు. చింతూరు, ఎటుపాక మండలాల్లోని మల్లంపేట, తేగ, నర్పింగపేటల్లో గల గ్రామాల్లో ముగ్గురు పాస్టర్లను అపహరించారు. వారం రోజుల కిందట ఓ పాస్టర్ కుమారుడిని కూడా మావోలు ఎత్తుకెళ్లారు. అయితే ఆ గ్రామాలు మావోయిస్టులకు పట్టున్న గ్రామాలు కావడంతో వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వారి అపహరణ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

  • Loading...

More Telugu News