: ఇనార్బిట్ మాల్ లో సందడి చేసిన అఖిల్
హైదరాబాదులోని ఇనార్బిట్ మాల్ లో సినీ నటుడు అక్కినేని అఖిల్ సందడి చేశాడు. త్వరలో విడుదల కానున్న తొలి సినిమా 'అఖిల్' ప్రమోషన్ లో భాగంగా ఇనార్బిట్ మాల్ కు చేరుకున్న అఖిల్ అభిమానులతో ముచ్చటించాడు. తాను క్రికెటర్ నైనప్పటికీ నటనే తన జీవితమని చెప్పాడు. తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాడు. తాను నటించిన తొలి సినిమాను ఆదరించాలని అభిమానులను కోరాడు. సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని భావిస్తున్నానని అఖిల్ వెల్లడించాడు. ఈ సందర్భంగా పలువురు అభిమానులతో సెల్ఫీలు దిగాడు. ఆ అనుభవాన్ని గుర్తుంచుకునేందుకు సెల్ఫీ స్టిక్ తో ఓ సెల్ఫీని తీసుకున్నాడు. కాగా, ఈ నెల 11న అఖిల్ సినిమా అభిమానుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.