: చిరంజీవి పెద్ద కొడుకును నేనే...కావాలంటే డీఎన్ఏ టెస్టుకి రెడీ!: మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించిన యువకుడు


కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి పెద్ద కుమారుడినంటూ రవీందర్ అనే వ్యక్తి మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించడం కలకలం రేపింది. కావాలంటే డీఎన్ఏ టెస్టులు కూడా చేసుకోవచ్చని రవీందర్ సవాలు విసిరాడు. చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 'పసివాడి ప్రాణం' సినిమాలో పసివాడిగా నటించానని చెబుతున్నాడు. దీనిపై చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్షేషన్ కోసం ఆ వ్యక్తి చిరంజీవి కుమారుడినని చెప్పుకుంటున్నాడని వారు మండిపడ్డారు. 'పసివాడి ప్రాణం' సినిమాలో నటించింది అబ్బాయి కాదు, అమ్మాయని వారు చెబుతున్నారు. అయినా 28 ఏళ్ల క్రితం సినిమా వస్తే...ఇన్నేళ్ల తరువాత కొడుకునంటూ రావడం ఏంటని వారు అడుగుతున్నారు. చిరంజీవి పెద్ద కొడుకునంటున్న రవీందర్ కు మతి భ్రమించిందని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News