: యువ హీరో అఖిల్, నితిన్ లతో సమంతా సెటైర్లు
‘‘హాయ్ అఖిల్ గారూ... నన్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు?’’ అన్న హీరో నితిన్ ప్రశ్నకు, ‘‘నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అని యువ హీరో అఖిల్ సమాధాన మిచ్చారు. ఈ సంభాషణ అంతా గమనిస్తున్న బ్యూటీ సమంత వాళ్లిద్దరిపై సెటైర్లు వేసింది. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? ట్విట్టర్ లైవ్ చాట్ లో వాళ్ల ముగ్గురూ సరదాగా చాట్ చేసుకున్నారు. అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న యువహీరో అఖిల్ మొదటి సినిమా దీపావళి పండగకు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన అభిమానులతో అఖిల్ ట్విట్టర్ ఖాతా ద్వారా లైవ్ చిట్ చేశారు. ఈ చిట్ చాట్ లో హీరో నితిన్ కూడా సరదాగా అఖిల్ కు ట్వీట్ చేశారు. ఈలోగా సమంత లైన్ లోకి వచ్చింది. ‘నితిన్... ఈ కెమిస్ట్రీ నాతో ఉంటే మనం సూపర్ డూపర్ హిట్ ఇవ్వచ్చు’ అంటూ కామెంట్ చేసింది. సమంత కామెంట్ కు స్పందించిన నితిన్... ‘మా ‘బ్రొ’ మాన్స్ మధ్య విలన్ గా రావద్దు సామ్స్’ అంటూ ట్వీట్ చేశాడు. 'సామ్స్, ప్లీజ్.. నితిన్కు ఎమోషనల్ సీన్స్ ఇవ్వమని త్రివిక్రమ్ గారికి చెప్పు, అప్పుడు నితిన్ నన్ను మిస్ అవుతాడు' అని అఖిల్ అనగానే, ‘అప్పుడు నేను నితిన్ను తోసేస్తాను’ అంటూ సమంత ముగించింది. ఆ తర్వాత నితిన్, అఖిల్ లు కొంతసేపు చిట్ చాట్ చేశారు.