: అమరావతిలో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తాం: దత్తాత్రేయ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మిక చట్టాలు సవరిస్తూ పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడతామని తెలిపారు. హైదరాబాద్ లో ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు సైతం ఈపీఎఫ్ ఖాతా నిర్వహించేలా చట్టసవరణ చేస్తామన్నారు. 18 ఏళ్లలోపు వారు పరిశ్రమల్లో పని చేయకుండా చట్ట సవరణ తెస్తామని పేర్కొన్నారు.