: 29 ఏళ్లకే నాయనమ్మ అయింది!


ఒక మహిళ 29 ఏళ్లకే నాయనమ్మ అయింది. ఈ ముచ్చట అర్జెంటీనాలో చోటుచేసుకుంది. అక్కడి మెందోజా రాష్ట్రంలోని రఫెల్ సిటీలో లూసియా దెసిరీ పాస్తనెజ్ అనే ఇరవై తొమ్మిదేళ్ల మహిళ నివసిస్తోంది. సెకండరీ స్కూల్ విద్యార్థి అయిన ఆమె చిన్న కొడుకు (అతని వయసు 14 ఏళ్లు), గాళ్ ఫ్రెండ్ తో సంబంధం కారణంగా ఈ టీనేజ్ కుర్రాడు తండ్రి అయినట్లు శుక్రవారం మీడియా పేర్కొంది. ఈ సందర్భంగా నాయనమ్మ లూసియా మాట్లాడుతూ, ‘నా చిన్న కొడుకు పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నాడు. అదే సమయంలో తన కొడుకు గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నా కుమారుడు చిన్న వయస్సు వాడే అయినప్పటికీ, కుటుంబ సంబంధాలు, వాటి విలువ గురించి వాడికి బాగా తెలుసు. వాడి కుటుంబ వ్యవహారాల్లో నేనేమి జోక్యం చేసుకోను. అయితే, నా కొడుకుకి మా సహాయ సహకారాలు అందిస్తాం. ఎందుకంటే, ఇంత చిన్న వయస్సులో ఈ భారాన్ని, అనుభవాన్ని భరించడం చాలా కష్టం. కుటుంబ భారాన్ని మోయలేక బిడ్డలను పట్టించుకోని తల్లిదండ్రులను చాలా మందిని మా ప్రాంతంలో చూస్తున్నాము. అటువంటి పరిస్థితి నా కొడుక్కి రాకూడదు’ అని లూసియా పేర్కొంది.

  • Loading...

More Telugu News