: సినిమాలు కాదు, దేశమే నాకు ముఖ్యం: అనుపమ్ ఖేర్


పరమత సహనాన్ని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖులు రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సినీ నటులు, కవులు, కళాకారులు, మేధావులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దేశంలో నెలకొన్న అసహనానికి, మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందులో పాల్గొనడం వల్ల సినిమాల్లో తనకు అవకాశాలు రాకపోవచ్చని, అయినా సినిమాల కంటే తనకు దేశమే ముఖ్యమని చెప్పారు. కొంతమంది రచయితలు, మేధావులు తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం తెలిసిందే. దీనిపై ఖేర్ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, అందువల్ల అవార్డులను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు.

  • Loading...

More Telugu News