: హీరోలు అలాంటి ప్రయోగాలు చేయొచ్చు...హీరోయిన్లు మాత్రం 'నో' చెప్పాలి: నర్గీస్ ఫక్రీ
ఆయా పాత్రల్లో జీవించేందుకు తమ శరీరంతో ప్రయోగాలు చేయడంలో విక్రమ్, అమీర్ ఖాన్ లను మించిన నటులు లేరు. వీరికి పాత్ర నచ్చితే చాలు, దాని కోసం ఎంతటి కష్టాన్ని భరించేందుకైనా వెనుకాడరు. అదే వారికి సక్సెస్ తోపాటు భారీ సంఖ్యలో అభిమానులను కూడా సమకూర్చింది. అయితే అలాంటి ప్రయోగాలు హీరోలకు ఓకే కానీ, హీరోయన్లకు మాత్రం వర్కౌట్ కావని అంటోంది బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. సినిమాల్లో పాత్రల పేరు చెప్పి ఫిట్ నెస్ తో ప్రయోగాలు సరికాదని పేర్కొంది. అమ్మాయిలకు ఎల్లవేళలా అదే మంచిదని చెప్పింది. అమ్మాయిలు వీలైనంత ఫిట్ గా స్లిమ్ గా ఉండేందుకు ప్రయత్నించాలని ఫక్రీ సూచించింది. బరువు పెరిగి, తరగడం అమ్మాయిలకు మంచిది కాదని ఆమె పేర్కొంది.