: ఇక సైనికుల వంతు... 'ఓఆర్ఓపీ' కోసం గౌరవ పతకాలను వెనక్కిచ్చేయాలని నిర్ణయం!


దేశవ్యాప్తంగా నెలకొన్న మత అసహనంపై పలువురు రచయితలు, ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తూ, గతంలో తమకు వచ్చిన పురస్కారాలను వెనక్కిచ్చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న వేళ, మాజీ సైనికులు సైతం తమ దీర్ఘకాల డిమాండ్ ఓఆర్ఓపీ (వన్ ర్యాంక్ వన్ పెన్షన్) అమలు జాప్యాన్ని నిరసిస్తూ, తమ పతకాలను వెనక్కివ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11, 12వ తేదీలు ఇందుకు వేదిక కానున్నాయని సమాచారం. దీర్ఘకాలంగా మాజీ సైనికోద్యోగులు ఓఆర్ఓపీని డిమాండ్ చేస్తుండగా, ఇటీవల ఆగస్టు 15న ప్రధాని మోదీ దీనికి ఆమోదం తెలిపారు. ఆపై, పథకాన్ని మాత్రం ఇంకా ప్రారంభించని సంగతి తెలిసిందే. దీంతో మాజీ సైనికులు సైతం రచయితలు, ప్రముఖులు నడిచిన దారిలోనే నడవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News