: డిప్యూటీ సీఎం కడియంపై 'చెప్పు' విసిరిన రైతు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వరంగల్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలో శాయంపేట ఎన్నికల ప్రచారంలో మంత్రులు కడియం, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా అనూహ్యంగా కడియంపై సాయిలు అనే రైతు చెప్పు విసిరాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.