: ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్ కంచుకోటగా చేస్తా: తుమ్మల


ఒకప్పుడు కమ్యూనిస్టుల ఖిల్లాగా ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత టీడీపీకి అండగా నిలబడ్డ ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మారుస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని మధిరలో వైసీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగరాణి, టీడీపీ, కాంగ్రెస్ లకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఈ రోజు తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, జెండాలు, అజెండాలు పక్కన పెట్టి... కేవలం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. రానున్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News