: ఛోటా రాజన్, దావూద్ ల వల్ల వేలమంది ప్రాణాలు కోల్పోయారు: వెంకయ్యనాయుడు


మాఫియా డాన్ ఛోటా రాజన్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంల వల్ల దేశంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దావూద్ పాకిస్థాన్ లో ఉన్నాడన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసునని, వారి పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో తీవ్రవాదం, మాఫియాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇదిలా ఉంచితే, ప్రకృతి వైపరీత్యాలపై ఈ నెల 19 నుంచి విశాఖలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలంటూ వెంకయ్యను ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News