: అల్లు అర్జున్ పేరిట ఓటు కోసం వరంగల్ లో దరఖాస్తు... రంగంలోకి దిగిన 'సైబర్ క్రైమ్'
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పేరు, ఫోటోను వాడుతూ ఎవరో ఆకతాయిలు ఆన్ లైన్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది. ఖిల్లా వరంగల్ లోని ఇంటి నంబర్ 16-10-1452లో ఆయన నివాసం ఉంటున్నాడని, వయస్సు 30 సంవత్సరాల 7 నెలలని చెబుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తును కనుగొన్న అధికారులు విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అరుణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అరుణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.