: సీఎంకు వ్యతిరేకంగా పోస్టు పెట్టి అరెస్టైన జర్నలిస్టు
ఏకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి లేని సమస్యలను కొనితెచ్చుకున్నాడో జర్నలిస్టు. వివరాల్లోకి వెళ్తే, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు వ్యతిరేకంగా రాజేష్ శర్మ అనే జర్నలిస్టు ఫేస్ బుక్ లో కామెంట్లు చేశాడు. ఈ కామెంట్లు దుమారం రేపాయి. దీంతో, ముఖ్యమంత్రిని అవమానించేలా, ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెట్టారని కాంగ్రెస్ నేత పూరన్ చాంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.