: సచిన్, వార్న్ నేతృత్వంలోని ఆల్ స్టార్స్ క్రికెట్ జట్ల సభ్యులు వీరే
క్రికెట్లో తమదైన సత్తా చాటి, ఆపై ఆటకు దూరమైన దిగ్గజాల మధ్య ఆసక్తికర పోరు న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో శనివారం నాడు జరగనున్న సంగతి తెలిసిందే. కేవలం కొన్ని దేశాలకే పరిమితమైన క్రికెట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో సచిన్ టెండూల్కర్ కు వచ్చిన ఆలోచన అందరికీ నచ్చగా, సీనియర్ ఆటగాళ్లు రెండు టీములుగా ఏర్పడి అమెరికాలో మ్యాచ్ ఆడేందుకు నిర్ణయించుకున్నారు. ఒక జట్టుకు సచిన్, మరో జట్టుకు ఆస్ట్రేలియా స్నిన్నర్ షేన్ వార్న్ కెప్టెన్లుగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లలోని ఆటగాళ్ల వివరాలివి.. సచిన్స్ బ్లాస్టర్స్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, బ్రియాన్ లారా, సౌరవ్ గంగూలీ, మహేల జయవర్థనే, కార్ల్ హూపర్, మోయిన్ ఖాన్, ముత్తయ్య మురళీధరన్, గ్రేమీ స్వాన్, కర్ట్ లీ ఆంబ్రోస్, షాన్ పొలాక్, గ్లెన్ మెక్ గ్రాత్, లాన్స్ క్లూసెనర్, షోయబ్ అఖ్తర్. వార్న్స్ వారియర్స్: షేన్ వార్న్ (కెప్టెన్), మాథ్యూ హెడెన్, మైఖేల్ వాన్, రికీ పాంటింగ్, జాంటీ రోడ్స్, జాక్వస్ కలిస్, ఆండ్ర్యూ సైమండ్స్, కుమార సంగక్కార, సక్లయిన్ ముస్తాక్, డేనియల్ వెటోరీ, కోట్నీ వాల్ష్, వసీం ఆక్రమ్, అలెన్ డొనాల్డ్, అజిత్ అగార్కర్. కాగా, ఈ టీముల కూర్పు అద్భుతమని, క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఓ పండగని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.