: చార్మినార్ కు కెమికల్ ట్రీట్ మెంట్... దుమ్మూ ధూళిని శుభ్రం చేయిస్తున్న పురావస్తు శాఖ


చార్మినార్ కు పూర్వవైభవం తెచ్చేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ఆ శాఖ ఆధ్వర్యంలో కెమికల్ ట్రీట్ మెంట్ పనులు ప్రారంభమయ్యాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చారిత్రక కట్టడానికి దుమ్మూ ధూళిని, కాలుష్య పొగతో ఏర్పడిన మరకలను శుద్ధి చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఆ పనులు రెండు నెలలపాటు జరుగుతాయని కెమికల్ ట్రీట్ మెంట్ విభాగం అధికారులు చెప్పారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ బ్రాంచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీఎస్ రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని ఆర్కియలాజికల్ కెమిస్ట్రీ అసిస్టెంట్ తెలిపారు. ఇప్పటికే చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపున ఉన్న మినార్లకు కెమికల్ ట్రీట్ మెంట్ పూర్తయిందని, తరువాత కింది భాగంలో పనులు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News