: రంగా హత్యలో బాబు పాత్ర ఉందని అంతా నమ్మారు... నేను కూడా అదే నమ్మాను: హరిరామజోగయ్య


తాను రాసిన పుస్తకంపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వివరణ ఇచ్చారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని అప్పట్లో అందరూ నమ్మారని... తాను కూడా అదే నమ్మానని చెప్పుకొచ్చారు. తాను నమ్మిన విషయాన్నే పుస్తకంలో రాశానని, అంతకు మించి మరే కారణం లేదని చెప్పారు. తాను పార్టీలు ఎందుకు మారానన్న విషయాన్ని వెల్లడించేందుకే ఈ పుస్తకం రాశానని అన్నారు. తన పుస్తకంపై టీడీపీ నేతలు అతిగా స్పందించారని, పుస్తకాలు అమ్ముకోవడానికే ఇలాంటివి రాశానని ఆరోపించారని... అయితే ఇరవై రూపాయలకే ఇస్తున్న ఈ పుస్తకం డబ్బు కూడా అనాధ శరణాలయానికే జమ చేస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News