: జుకెర్ బర్గ్ దంపతులకు కూతురు పుడుతుందట!...ప్రెగ్నెంట్ భార్య ఫొటోను షేర్ చేసిన ఫేస్ బుక్ చీఫ్


సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. జుకెర్ బర్గ్ భార్య ప్రిస్కిల్లా పండంటి ఆడ బిడ్డకు త్వరలో జన్మనివ్వనుందట. ఈ మేరకు జుకెర్ బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక గర్భిణి అయిన భార్యతో కలిసి తీసుకున్న ఫొటోను ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిజ్ చేత తీయించుకున్న సదరు ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జుకెర్ బర్గ్, గర్భవతిగా తన భార్య ఫీలింగ్స్ ను ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు. అంతేకాక సదరు ఫొటోను అద్భుతంగా తీశారంటూ అన్నీ లీబోవిజ్ ను పొగుడుతూ కూడా జుకెర్ బర్గ్ కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News