: నేను అధికారంలో ఉన్నా...నువ్వు ఏం చేసినా చెల్లదు!: కోడలును బెదిరించిన సిరిసిల్ల రాజయ్య


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. అత్తింటి వేధింపులపై సారిక చనిపోవడానికి ముందే తన న్యాయవాది రెహానాకు ఓ మెయిల్ పంపిందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మెయిల్ కలకలం రేపుతోంది. అత్తను సూర్యకాంతంతో పోల్చిన సారిక తన మామ సిరిసిల్ల రాజయ్యపై తీవ్ర ఆరోపణలు చేసింది. అన్నం కూడా పెట్టకుండా అత్త మాధవి వేధిస్తే, తండ్రి లాంటి మామ ఎంతమాత్రమూ జాలి చూపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. జాలి చూపకపోగా, కర్కశంగా మాట్లాడి భిక్షం ఎత్తుకోవాల్సిందేనని బెదిరించారని వాపోయింది. ‘‘నువ్వు నీ జీవితాన్ని త్యాగం చెయ్యి. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు, భర్త కోసం త్యాగం చేశారు. నువ్వు ఏం చేసినా చెల్లదు. నేను అధికారంలో ఉన్న. నువ్వు భిక్షం ఎత్తి బతకాల్సిందే’’ అని రాజయ్య తనను బెదిరించారని సారిక ఆ మెయిల్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News