: టీవీ షో ద్వారా మల్లికా శరావత్ 'స్వయంవరం'


పూర్వం రాజుల కాలంలో స్వయంవరాలు జరగడం విన్నాం. రాజ్యాలు పోయినా.. నేడు కొందరు బాలీవుడ్ భామలు మాత్రం స్వయంవరమే ముద్దు అంటున్నారు. రాఖీ సావంత్, రతన్ రాజ్ పుత్ టీవీ షో ద్వారా తమ మిస్టర్ రైట్ పెళ్లికొడుకును ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి బాటలో మల్లిక శరావత్ కూడా నడవబోతోంది.

లైఫ్ ఓకే చానల్ లో 'ది బ్యాచులరెట్ ఇండియా - మేరే ఖయాలోన్ కి మల్లిక' కార్యక్రమం త్వరలో ప్రసారం కాబోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 36 ఏళ్ల మల్లిక మనసైన మగాడిని వెతుక్కుంటుందట. దీనిపై మల్లిక మాట్లాడుతూ.. ''తన కాళ్లపై నిలబడ్డవాడు, ఉన్నత విద్యావంతుడు, ఒక స్నేహితుడిలా, ప్రేమికుడిలా ఉండేవాడు కావాలి. జీవితంలో సాహసాలు చేసేవారికి ప్రాధాన్యమిస్తా. ముఖ్యంగా తను మనసులో అనుకున్న భావాలను నిర్భయంగా బయటకు వెల్లడించే సత్తా ఉన్నవాడు కావాలి. ఈ టీవీ షో ద్వారా నేను కోరుకునే అసలైన వాడు, ఒక ఫ్రెండ్, సోల్ మేట్ ను గుర్తించగలనని ఆశిస్తున్నాను'' అని చెప్పింది. మొత్తానికి ఈ షో ద్వారా మల్లికకు భర్త, లైఫ్ ఓకే చానల్ కు మంచి ప్రాచుర్యం రానున్నాయి.

  • Loading...

More Telugu News