: బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్... నేడు విశాఖ వ్యాప్తంగా గిరిజనుల ఆందోళనలు


బాక్సైట్ తవ్వకాలపై నిన్నటిదాకా అమలవుతున్న నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. విలువైన ఖనిజం తవ్వకానికి చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో విశాఖ మన్యంలోని బాక్సైట్ కొండలపై నేడు తవ్వకాలు మొదలు కానున్నాయి. బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు ఆది నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ఊహించని విధంగా బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో గిరిపుత్రులు షాక్ తిన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా నేడు విశాఖ వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసనలకు వారు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News