: ‘అనంత’లో రెచ్చిపోయిన దొంగలు... నాందేడ్, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లలో వరుస చోరీలు


ఏపీలోని అనంతపురం జిల్లాలో నిన్న దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముకుమ్మడిగా రైలు పట్టాలపైకి వచ్చిన దొంగలు అదను చూసి స్వైరవిహారం చేశారు. గుత్తి వద్ద రాయలసీమ, నాందేడ్, ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు. సిగ్నల్స్ కోసం గుత్తి దగ్గర ఆగిన రైళ్లపై దొంగలు ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేశారు. రైళ్లు ఆగగానే వాటిపై రాళ్లు విసురుతూ, కత్తులతో విరుచుకుపడుతూ ప్రయాణికులను బెంబేలెత్తించి ఆపై చోరీకి పాల్పడ్డారు. మూడు రైళ్లల్లోని ప్రయాణికుల నుంచి దొంగలు పెద్ద ఎత్తున బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దోపిడీ దొంగల స్వైర విహారంపై ఆ తర్వాత ప్రయాణికులు గుంతకల్ లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు దొంగల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల దాడిలో లోకో పైలట్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News