: టపాకాయలపై మతసంబంధమైన చిత్రాలు వద్దంటున్న హిందూ సురక్ష సమితి
దీపావళి టపాకాయలపై మత సంబంధమైన చిత్రాలు, దేవుళ్ల ఫొటోలు వద్దంటూ అఖిల భారతీయ హిందూ సురక్ష సమితి డిమాండ్ చేసింది. పంజాబ్ లోని హిందూ సురక్ష సమితి ప్రతినిధి దీపక్ భరద్వాజ్ మాట్లాడుతూ, పగ్వరా ప్రాంతంలోని దుకాణాల్లో ఈ తరహా టపాసులను కనుక విక్రయిస్తే వెళ్లి అడ్డుకుంటామన్నారు. అటువంటి టపాసులను కొనుగోలు చేయవద్దని, వ్యాపారులకు, వినియోగదారులకు సూచించారు. మతచిహ్నాలతో, దేవుళ్ల బొమ్మలతో టపాకాయలను తయారు చేయవద్దని తయారీ సంస్థలను హెచ్చరించారు. ఈ విషయమై ప్రజలకు కూడా విన్నవిస్తున్నామని ఆయన అన్నారు.