: వికలాంగులు వెళ్లే పోలింగ్ బూత్ లకు ఈ ఏర్పాట్లు ఉండాలట!
ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వారంతట వారే వెళ్లే వికలాంగులు కొంతమంది ఉంటారు. ఎవరైనా సహాయపడితేనే పోలింగ్ కేంద్రానికి వెళ్ల గలిగే వికలాంగులు మరికొంతమంది ఉంటారు. ఎవ్వరూ పట్టించుకోకపోతే ఇంట్లోనే ఉండిపోయే వారు ఇంకొందరు. దీనిని దృష్టిలో పెట్టుకుని వికలాంగుల హక్కుల సంఘం ఒకటి తమిళనాడు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సందీప్ సక్సేనాను కలిసింది. వికలాంగులు ఓట్లు వేయాలంటే ఆ బూత్ లకు కావాల్సిన వసతుల గురించి డిమాండ్ల రూపంలో ఆ సంఘం తెలియపరిచింది. సుమారు 25 డిమాండ్లు చేసింది... వాటిలో కొన్ని... 1. పోలింగ్ బూత్‌ల వద్ద రోడ్డు దాటడానికి సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. 2. వాహనాలు వెళ్లడానికి రోడ్లతో పాటు నడిచి వెళ్లే వాళ్లకు ఫుట్‌పాత్‌లు ఉండాలి. 3. కిలోమీటర్ దూరం నుంచే సూచికల బోర్డులను పెట్టాలి. 4. వికలాంగుల వాహనాలు పెట్టడానికి ప్రత్యేక పార్కింగ్ సదుపాయం,సూచిక బోర్డులతో.. 5. వీల్‌చైర్లు వెళ్లడానికి ర్యాంపులతో పాటు అంధులు వెళ్లడానికి మెట్లు కూడా ఉండాలి. 6. పోలింగ్ బూత్ ప్రధాన ద్వారం తెరిచే ఉంచాలి. 7. వీల్ చైర్స్‌కు తలుపు మూడు అడుగుల దూరంలో ఉండాలి. 8. బ్యాలెట్ పత్రానికి సంబంధించిన సందేహాల నివృత్తికి ఒక గైడ్‌ను ఏర్పాటు చేయాలి. 9. పోలింగ్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పెట్టాలి. పైఅంతస్తుల్లో పెట్టినా ఎస్కలెటర్ వంటివి ఉండాలి. 10. పోలింగ్ బూత్‌లో వీల్ చైర్లు తిరగడానికి వీలుగా, విశాలంగా ఉండాలి.