: వ్యంగ్య ఫొటోలు పెట్టినందుకు 'సారీ' చెప్పిన పాకిస్థాన్ నటి!


పాకిస్థాన్ నటీ నటులను బాలీవుడ్ సినిమాల్లో నటించనివ్వమని కొన్ని రోజుల క్రితం శివసేన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకుని గత వారం ముంబైలో జరిగిన హాలోవీన్ పార్టీ సందర్భంగా పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ ఓ ఫోటో తీసుకుని ట్విట్టర్లో పెట్టింది. ఇది వివాదాస్పదమైంది. ఈ పోటోలో శివసేన వ్యవస్థాపక అధినేత బాల్ ఠాక్రే ఆహార్యాన్ని పోలినట్టు నుదుట తిలకం, మెళ్ళో రుద్రాక్షల దండలు, కాషాయ వస్త్రం ధరించిన పాకిస్థాన్ దర్శకుడు అసీజ్ రజా 'మహీరాకో బహర్ నికాలో' అనే ప్లకార్డు పట్టుకుని ఉంటాడు. క్యాట్ ఉమన్ ఆహార్యంలో అతని భుజంపై చెయ్యివేసి మహీరా నవ్వుతూ ఉంటుంది. ఈ ఫోటోను మహీరా ఖాన్ ట్విట్టర్లో పోస్టు చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె క్షమాపణలు చెప్పింది. ఈ ఫోటో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని మహీరా ఖాన్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News