: ఇది అత్యంత చెత్త వికెట్: సౌతాఫ్రికా బౌలర్ ఎల్గర్


సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు హీరో డీన్ ఎల్గర్ మొహాలీ పిచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ, టీట్వంటీ, వన్డే సిరీస్ లలో పరాజయం తరువాత తమకు వ్యతిరేకంగా వికెట్ రూపొందిస్తారని ఊహించామని, అయితే ఇంత చెత్త వికెట్ రూపొందిస్తారని ఊహించలేదని అన్నాడు. తాము ఇంతకుముందు ఆడిన పిచ్ ల కంటే ఈ పిచ్ ఎంతో భిన్నంగా ఉందని పేర్కొన్నాడు. ఈ టెస్టులో ఫలితం వచ్చినా ఇది మంచి పిచ్ కాదని, అత్యంత చెత్తపిచ్ అని అన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎల్గర్ స్పష్టం చేశాడు. కాగా, ఎల్గర్ నాలుగు వికెట్లు తీయడం విశేషం.

  • Loading...

More Telugu News