: మాజీ ఎంపీ రాజయ్య కోడలు, మనవళ్ల మృతిపై ఫోరెన్సిక్ నిపుణుల అనుమానాలివే!


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతిపై ఫోరెన్సిక్ నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదయినా వస్తువు కాలినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణులు నారాయణరెడ్డి తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ విడుదలైతే మృతదేహం బ్రైట్ గా ఉంటుందని, దాంతో కాలిన గాయాల కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించవచ్చని, అలా కాకపోతే ముందే చంపేసి తరువాత మృతదేహాలను కాల్చారా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. మృతదేహం ఎడమవైపు కాలింది, అలా ఎందుకు జరిగిందో చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ ఘటన తరువాత తలుపు ఎవరు తెరిచారన్నది కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తెల్లవారు జామున మృతిచెందితే సాయంత్రం వరకు మృతదేహాలు సంఘటనాస్థలిలోనే ఉన్నాయని, అప్పుడే వైద్యులను తీసుకెళ్లాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దకుమారుడు, తల్లి మృతదేహాలు డోర్ దగ్గర లభించినట్టు తెలుస్తోందని, అలా అయితే వారు డోర్ తీసేందుకు ప్రయత్నించారని, అంటే బయటి నుంచి ఎవరైనా గడియపెట్టారా? అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మంటలు అంటుకుంటే వేడికి, భయానికి పిల్లలు అటూ ఇటూ పరుగెత్తాలని, పిల్లలిద్దరూ బెడ్ పై పడుకుని ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే సిలెండర్లపై కూడా అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News