: గుండెపోటుతో తమిళ నటుడు ప్రభు లక్ష్మణ్ మృతి
ప్రముఖ తమిళ నటుడు ప్రభు లక్ష్మణ్ గుండెపోటుతో మృతి చెందారు. దర్శకుడు మణిరత్నం ఇటీవల రూపొందించిన 'ఓ కాదలి కణ్మని' (తెలుగులో 'ఒకే బంగారం') సినిమాలో ప్రభు లక్ష్మణ్ 'బడ్డీ' పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, సోషల్ మీడియాలో 'సహృదయుడైన మంచి నటుడు అందర్నీ షాక్ కు గురిచేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయార'ని నిర్మాత సౌందర్య రజనీకాంత్ సంతాపం తెలిపారు. ప్రభు లక్ష్మణ్ మృతి పట్ల ప్రముఖ నటి ఖుష్బూ ట్విట్టర్లో 'నలుగురు పిల్లలు, చక్కని భార్యను శోకంలో ముంచి తిరిగిరాని, సుదూరతీరాలకు వెళ్లిపోయాడ'ని పేర్కొన్నారు.