: తెలంగాణలో 30 లక్షల ఓట్లను తొలగించాం!: సీఈఓ భన్వర్ లాల్
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 30 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్ లాల్ వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘హైదరాబాద్ పరిధిలో 9 లక్షల నకిలీ ఓట్లను తొలగించాము. తెలంగాణాలో జిల్లాల వారీగా 26 శాతం ఓట్లు తొలగించడం జరిగింది. కరీంనగర్ లో 20 శాతం, మిగతా జిల్లాల్లో 15 శాతం చొప్పున ఉండగా రంగారెడ్డి జిల్లాలో మాత్రం కేవలం 6 శాతం మాత్రమే తొలగించాము. ఓటరు నమోదుకు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్ ను కోరాము. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఈసీ నిర్ణయం వచ్చే అవకాశము ఉంది' అని ఆయన వెల్లడించారు.