: దేశానికి పొంచి ఉన్న ముప్పు అదే: రాజ్ నాథ్ సింగ్
సైబర్ క్రైం నుంచి భారత దేశానికి పెను ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో గ్రౌండ్ జీరో సమ్మిట్-2015లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజు రోజుకీ సైబర్ క్రైం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రస్తుతానికి భారత్ లో కట్టుదిట్టమైన సైబర్ భద్రత ఉందని చెప్పిన ఆయన, సైబర్ నేరాలపై పర్యవేక్షణకు నిపుణులతో కూడిన కమిటీ వేయనున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో సైబర్ క్రైం కంట్రోల్ హబ్ ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.