: ఎన్డీయే, టీఆర్ఎస్ మధ్యే పోటీ: లక్ష్మణ్
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యే పోటీ ఉంటుందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఓటర్లను ఓట్లు అడిగేముందు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్న సంగతిని టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఓటర్లు విజ్ఞత కలిగిన వారని, బీజేపీకే ఓటు వేస్తారని చెప్పారు. తమ ఉమ్మడి అభ్యర్థి దేవయ్య 1969లోనే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. దేవయ్యపై విమర్శలు గుప్పిస్తే, తెలంగాణ ఉద్యమంపై గుప్పించినట్టే అని చెప్పారు. రాజయ్యను ఎన్నికల బరి నుంచి ఎందుకు తప్పించారో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన దురదృష్టకరమే అయినప్పటికీ, ఆ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.