: 1980 లలో అమెరికా చేసిన పని ఇప్పుడు ‘తెలంగాణ’ మొదలుపెట్టింది: రతన్ టాటా
‘1980ల్లో అమెరికా చేసిన పని ఇప్పుడు మనం చేస్తున్నాం. దానికి నాంది పలికింది తెలంగాణ రాష్ట్రమే. అదే టీ-హబ్’ అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో టీ-హబ్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. ఒక ఆలోచనతో వచ్చే ఔత్సాహికులు దాన్ని సాఫల్యం చేసుకుని తిరిగి వెళ్లే వీలును కల్పించేలా తెలంగాణ సర్కార్ చేసింది. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రతన్ టాటా అన్నారు. ఇండియాలో ఈ తరహా హబ్ ప్రారంభం కావడం ఇదే మొదటిసారని గుర్తుచేసిన ఆయన, వినూత్న ఆలోచనలతో వచ్చే స్టార్టప్ కంపెనీల వారికి ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని రతన్ టాటా వెల్లడించారు.