: రాజన్ ను ముంబై తీసుకొచ్చి కేసులపై విచారిస్తాం: ముంబై సీపీ జావెద్ అహ్మద్


అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ను త్వరలో ముంబై తీసుకువస్తామని ముంబై పోలీస్ కమిషనర్ జావెద్ అహ్మద్ తెలిపారు. అతడిని ముంబై తీసుకొచ్చిన వెంటనే తొలుత జ్యోతిర్మయి డే అలియాస్ జేడే హత్యకేసుపై విచారణ చేస్తామని చెప్పారు. రాజన్ ను విచారించడం వలన చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయన్నారు. ముంబైలో మహిళా జర్నలిస్టుల రక్షణ కోసం మొబైల్ అప్లికేషన్ ను సీపీ జావెద్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగానే పైవిధంగా మాట్లాడారు. స్థానిక టాబ్లాయిడ్ లో జర్నలిస్టుగా పనిచేసే జేడే... దావూద్ ఇబ్రహీం, ఛోటాలపై పలు కథనాలు రాశారు. దాంతో 2011, జూన్ 11న తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో చోటా నిందితుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News