: పెళ్లి ముహుర్తం ఎప్పుడో చెప్పమన్న యువరాజ్ సింగ్ !
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పెళ్లిపై వచ్చిన వదంతులపై చిలిపిగా స్పందించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. ‘మీడియా వాళ్లు నా పెళ్లిని నిశ్చయించేశారు. వివాహవేదిక ఎక్కడో కూడా చెబుతున్నారు. తేదీ కూడా మీడియా చెబితే, ఆరోజు చక్కగా తయారై ముహుర్తం సమయానికి వస్తాను’ అంటూ యువీ చిలిపిగా ట్వీట్ చేశాడు. కాగా, స్పోర్ట్స్ వేగన్. ఇన్ వెబ్ పోర్టల్ యువరాజ్ సింగ్ పెళ్లి కుదిరిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బ్రిటిష్ మోడల్, నటి అయిన హాజెల్ కీచ్ ను వివాహం చేసుకోనున్నాడన్న వార్తలు ప్రచురించింది. కొన్ని నెలలుగా వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పేర్కొంది. అయితే, ఈ వార్తలను యువరాజ్ ఖండించాడు. తాజాగా, ఈ చిలిపి ట్వీట్ చేశాడు.