: పోరాటం పరిసమాప్తి, 201 పరుగులకు కుప్పకూలిన ఇండియా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత తొలి ఇన్నింగ్స్ పోరు 201 పరుగుల వద్ద ముగిసింది. కేవలం 68 ఓవర్లకే భారత ఆటగాళ్లు చాపచుట్టేశారు. ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరును చేరుకోలేకపోవడం, ముగ్గురు డక్కౌట్లు కావడం, కెప్టెన్ కోహ్లీ నిరుత్సాహకర ప్రదర్శన భారత్ ను కోలుకోలేని దెబ్బ తీశాయి. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎల్గర్ 4 వికెట్లతో రాణించగా, ఫిలాండర్, తాహిర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మరికాసేపట్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ మొదలు కానుంది.