: ప్రియాంకను పొగడ్తలతో ముంచెత్తిన హృతిక్ రోషన్
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన 'క్వాంటికో' టీవీ సిరీస్ చూసిన ఆయన... ప్రియాంక నటన అద్భుతంగా ఉందని ట్విట్టర్ లో కితాబిచ్చాడు. రెండు ఎపిసోడ్లు చూశానని... చాలా ఇంటరెస్టింగ్ గా ఉందని అన్నాడు. ఈ ట్వీట్ పై ప్రియాంక కూడా స్పందించింది. 'ఎల్లప్పుడూ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటున్నందుకు ధన్యవాదాలు హృతిక్' అంటూ రీట్వీట్ చేసింది. 'క్వాంటికో నీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది' చెప్పింది.