: ఏ క్షణమైనా చోటా వెనక్కి, విమానం సిద్ధంగా ఉంది: రాజ్ నాథ్


ఇండొనేషియా నుంచి ఏ క్షణమైనా చోటా రాజన్ ను ఇండియాకు తీసుకువచ్చే విమానం బయలుదేరవచ్చని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అక్కడ బద్దలైన అగ్నిపర్వతం ప్రభావం తగ్గిందని, విమానాల రాకపోకలకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే, ఇండియా నుంచి ప్రత్యేక విమానాన్ని పంపామని ఆయన తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఈ రాత్రిలోగా రాజన్ ముంబై చేరుకునే అవకాశముందని అన్నారు. ముంబైలో ఆయనపై ఎన్నో కేసులు ఉన్నందున విచారణ అక్కడే జరుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News