: అవార్డులు వెనక్కిచ్చేయడానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రేపు అనుపమ్ ఖేర్ ర్యాలీ
దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు, సాహితీవేత్తలు అవార్డులు వెనక్కిచ్చేయడాన్ని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పటికే వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అసహనం పెరుగుతోందంటూ గోల పెడుతున్న వారికి వ్యతిరేకంగా భారతీయులందరూ కలసి రావాలని ట్విట్టర్ లో ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 7న ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీకి అందరూ తరలిరావాలని అనుపమ్ కోరారు. ఆయన పిలుపుకు పలువురు బాలీవుడ్ దర్శకులు, నటులు, ఇతర ప్రముఖులు స్పందించి ప్రశంసిస్తున్నారు. కాగా ఈ ర్యాలీలో బాలీవుడ్ కు చెందిన పలువురు పాల్గొనే అవకాశం ఉంది.