: జీహెచ్ఎంసీలో బీసీ ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే... షెడ్యూల్ విడుదల


జీహెచ్ ఎంసీలో బీసీ ఓటర్ల గుర్తింపుకోసం ఇంటింటి సర్వే చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు బీసీ ఓటర్ల సర్వే జరగనుంది. 19 నుంచి 23 వరకు ఓటర్ల జాబితాలో బీసీలను చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 24న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సిద్ధం చేయనుండగా, 25 నుంచి డిసెంబర్ 1 వరకు బీసీ ఓటర్ల ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇక డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఫిర్యాదులపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. 7వ తేదీలోగా బీసీ ఓటర్ల జాబితా ఖరారు చేయనున్నారు. 9 నుంచి 12 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 13వ తేదీ నుంచి 15 మధ్యలో తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు.

  • Loading...

More Telugu News