: భారత పనివారికి వీసాలు ఆపేసిన కువైట్


కువైట్ లోని ధనవంతుల ఇళ్లల్లో పనిచేసేందుకు, అక్కడి వివిధ రంగాల్లో ఉపాధిని పొందగోరుతూ వెళ్లేవారికి వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ సర్కారు ఆదేశాలు జారీ చేసిందని ఆ దేశంలో భారత అంబాసడర్ సుమిత్ జైన్ స్పష్టం చేశారు. గల్ఫ్ రీజియన్లో భారత కార్మికులకు వీసాలను నిరాకరించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. ఇండియా నుంచి ఇళ్ల పనివారు, కార్మికులను తీసుకెళ్లే సంస్థలు, వ్యక్తులు 2,500 డాలర్లను బ్యాంకు గ్యారంటీగా చూపాల్సి వుందని, ఎవరూ దీన్ని పాటించడం లేదని, నిబంధనల అమలులో తరచూ విఫలం అవుతుండటం కూడా వీసాల జారీ నిలుపుదలకు కారణమని ఆయన అన్నారు. పరిస్థితిని సమీక్షించి వీసాల జారీ పునరుద్ధరించాలని కువైట్ అధికారులను కోరినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News