: ఒక పెళ్లికి రెండు సార్లు వెళతారా?: చంద్రబాబుపై సీపీఐ విమర్శలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం కరవుతో అల్లాడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఎవరైనా ఒక పెళ్లికి ఒకసారే వెళతారని... కానీ, సమస్యలను గాలికి వదిలేసిన చంద్రబాబు మాత్రం ఒక పెళ్లికి రెండు సార్లు హాజరయ్యారని ఎద్దేవా చేశారు. కరవు నేపథ్యంలో రైతులు బెంగళూరు, కేరళకు వెళ్లడంపై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియాతో సంబంధాలున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని... దీనిపై ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడుతున్నామని చెప్పారు.