: నిరుద్యోగులకు శుభవార్త... సీటెట్ పరీక్షా తేదీలు ఇవే!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎబిజిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షా తేదీలను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఈ ఉదయం విడుదల చేసింది. ఫిబ్రవరి 21, 2016న ఆపై సెప్టెంబరు 8న సీటెట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతుల వరకూ బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందగోరేవారు సీటెట్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలన్న సంగతి తెలిసిందే. రెండు విభాగాల్లో సీటెట్ జరుగుతుంది. ఐదవ తరగతి వరకూ పేపర్ - 1, ఆపై 8వ తరగతి వరకూ పేపర్ - 2 పరీక్షలు జరుగుతాయి.