: బిగ్ బి షో వేదికగా... సల్మాన్ ను కలుసుకోనున్న గీత


ఇటీవల పాకిస్థాన్ నుంచి భారత్ కు తిరిగొచ్చిన బధిర యువతి గీత కొన్నిరోజుల్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను కలవనుంది. ఇందుకు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలీటీ షో 'ఆజ్ కీ రాత్ హై జిందగీ' వేదికకానుంది. సల్మాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' చిత్రం గీత భారత్ కు తిరిగిరావడంలో ఎంతో దోహదపడింది. ఈ క్రమంలో స్వదేశానికి వచ్చాక తాను సల్మాన్ ను కలవాలనుకుంటున్నట్టు గీత కోరింది. ఇందుకు సల్లూ కూడా వెంటనే అంగీకరించాడు. దాంతో స్పూర్తినిచ్చే కథనాలకు వేదికగా నిలుస్తున్న బిగ్ బీ షోలో పాల్గొనేందుకు 8-10 తేదీల మధ్య గీతను ముంబై పంపాలంటూ షో నిర్వాహకులు ఇండోర్ కలెక్టర్ కు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News