: 'అసహనం'లోకి ఎంటరైన మరో బాలీవుడ్ ఖాన్!
దేశవ్యాప్తంగా మత అసహనం పెరుగుతున్న వేళ, దానిపై జరుగుతున్న వాడివేడి చర్చలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రవేశించాడు. అసహనంపై తొలిసారిగా నోరువిప్పిన ఆయన, మతాల ప్రాతిపదికన మనుషులు ఎలాంటివారో నిర్ణయించలేమని అన్నాడు. "మనమంతా మానవులం, సామరస్యంతో జీవించాలి. ఒకరిపక్కన ఒకరం ఉన్నాం. అందరూ భారతీయులమే. కలసి ముందుకు సాగాల్సిందే. నీ మతం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నం కాకూడదు" అన్నాడు సల్లూభాయ్. తన తాజా చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా బిజీగా తిరుగుతున్నాడు.