: బెడ్ రూంలో సిలిండర్... సిలిండర్ కు రెగ్యులేటర్... మరి గ్యాసెలా లీకైంది?


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నిన్న తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై అన్నీ చిక్కుముడులే. ఘటనకు కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమైన పోలీసులకు ఇప్పటిదాకా చిన్న ఆధారం కూడా లభించలేదు. అంతేకాక ప్రమాదాన్ని పరిశీలించిన పోలీసులకు అంతుచిక్కని అంశాలు కనిపించాయి. వంట గదిలో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ రాజయ్య కోడలు, మనవలు పడుకున్న గదిలోకి వచ్చేసింది. అక్కడ స్టౌ లేకున్నా, సిలిండర్ మాత్రమే ఉంది. అంతేకాక సిలిండర్ కు రెగ్యులేటర్ కూడా అలాగే ఉంది. అంటే, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అన్న మాటే లేదు. గ్యాస్ లీకైన కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. మరి సిలిండర్ కు రెగ్యులేటర్ ఉండగా, గ్యాసెలా లీకవుంతుందన్న ప్రశ్న ఇప్పుడు పోలీసుల బుర్రలకు పని చెబుతోంది. అంతేకాక వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ బెడ్ రూంలో కనిపించిన వైనంపై కూడా పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సిలిండర్ ను ఎవరో ఒకరు తప్పనిసరిగా వంటింటి నుంచి బెడ్ రూంకు తరలించి ఉండాలి. ఆ పని సారిక చేసిందా? లేక మరెవరైనా చేశారా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అంతేకాక గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే సిలిండర్ పేలిపోవడం ఖాయం. మరి సిలిండర్ పేలి ఉంటే, గదిలో బీభత్సం జరగాలి. అలాంటిదేమీ అక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఘటన జరిగిన తీరు అంతుబట్టడం లేదు. దీనిపై పోలీసుల అదుపులో ఉన్న రాజయ్య గాని, ఆయన కుమారుడు అనిల్ గాని, రాజయ్య భార్య మాధవి గాని నోరు విప్పితే తప్పించి దర్యాప్తు ముందుకు సాగేలా లేదు.

  • Loading...

More Telugu News