: స్నేహితుడిని జంతువుగా పొరబడ్డ వేటగాడు... నాటు తుపాకీతో కాల్చేసిన వైనం
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని అటవీ ప్రాంతంలో రాత్రి ఘోరం జరిగిపోయింది. అడవి జంతువుల వేటకు నాటు తుపాకులతో వెళ్లిన ఓ వేటగాడు, తన వెంట వచ్చిన మరో వేటగాడిని కాల్చి పారేశాడు. చీకటిలో స్నేహితుడిని జంతువుగా భావించిన వేటగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే... పలమనేరుకు చెందిన కిష్టప్ప మరికొంతమందితో కలిసి అడవి జంతువుల వేటకు వెళ్లాడు. రాత్రి వేళ చిమ్మ చీకటిలో తన వెంట వచ్చిన స్నేహితుడు చిరంజీవి అతడికి జంతువుగా కనిపించాడు. దీంతో వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో అతనిని కాల్చేశాడు. దీంతో జంతువుల వేటకు సంతోషంగా వెళ్లిన కిష్టప్ప అండ్ కో విచార వదనంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది.