: మామునూరు పీఎస్ లో రాజయ్య కుటుంబం... రాజయ్య ‘రెండో’ కోడలుపైనా కేసు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసుకు సంబంధించిన చిక్కుముడి ఇంకా వీడలేదు. నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిన్న సాయంత్రమే రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మామునూరు పోలీస్ స్టేషన్లో ఉంచిన రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. నేటి సాయంత్రంలోగా నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే... అనిల్, సారికల మధ్య విభేదాలకు కారణంగా భావిస్తున్న అనిల్ రెండో భార్య సన పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.