: 66 ఏళ్ల తర్వాత కలుసుకోనున్న ఇరు దేశాల అధ్యక్షులు!


చైనా, తైవాన్ దేశాధ్యక్షుల కలయిక చారిత్రక ఘట్టం కానుంది. మొట్టమొదటిసారిగా చైనా, తైవాన్ దేశాధినేతలు జీ జిన్‌పింగ్, మా యింగ్ జియ్ లు సమావేశం కానున్నారు. ఈ వారాంతంలో సింగపూర్‌లో వారిద్దరు భేటీ అవుతున్నారు. దౌత్యసంబంధాలు, కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ రెండు దేశాల అధ్యక్షులు సుమారు 66 ఏళ్ల తర్వాత కలుసుకోనుండటంతో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News