: ముంబయి సెంట్రల్ జైల్ కు చోటా రాజన్?
మాఫియా డాన్ చోటా రాజన్ ను ముంబయి సెంట్రల్ జైలులో ఉంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలోని బాలిలో చోటా రాజన్ ఇటీవల పట్టుపడ్డ విషయం తెలిసిందే. అక్కడి నుంచి భారత్ కి తీసుకువచ్చి ముంబయి సెంట్రల్ జైలులో ఉంచుతారని తెలుస్తోంది. ఇక్కడి సెంట్రల్ జైల్ లోని అత్యధిక భద్రత గల సెల్ ను ఆధీనంలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం జైలు అధికారులను ఇప్పటికే ఆదేశించింది. జైలు పరిసరాల్లో పారామిలటరీ బలగాలను మోహరింపజేయాలని ‘మహా’ సర్కార్ కు పోలీసు అధికారులు విన్నవించుకున్నారు. వీటన్నింటిని చూస్తుంటే రాజన్ ను ఈ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.