: దక్షిణాది రాష్ట్రాలను వదలని వర్షాలు
దక్షిణాది రాష్ట్రాల్లో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, గడచిన 24 గంటల్లో తమిళనాడు కాంచీపురం జిల్లా, తిరువళ్లూరుల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు.